మోదీ సర్కార్‌కు వరల్డ్‌ బ్యాంకు బూస్ట్‌

10 Jan, 2018 10:53 IST|Sakshi

వాషింగ్టన్: ప్రపపంచబ్యాంకు  మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట నిచ్చింది.భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్‌ చేస్తూ అంచనాలను విడుదల చేసింది. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం  ఊహించినదానికన్నా ఎక్కువే  వుంటుందంటూ మోదీ సర్కర్‌కు  మంచి ఉత్సాహాన్నిచ్చింది.  ముఖ‍్యంగా జీఎస్‌టీ, నోట్ల రద్దుపై విమర్శలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో  విడుదలైన  ఈ ప్రపంచ బ్యాంకు నివేదికపై బీజీపీ  వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఈ ఏడాది ఆర్థిక ప్రగతి 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాదు 2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కూడా 7.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో  తెలిపింది. ప్రపంచదేశాలపైన కూడా  తన నివేదికను వెల్లడించిన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడించింది.

భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ సందర‍్భంగా  భారత ఆర్థిక ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. జీఎస్టీ వల్ల వృద్ధి రేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2019-20లో జీడీపీ 7.5 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది.  నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మేకిన్ ఇండియా వల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని  వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ తెలిపారు. పెట్టుబడులకు ఇది  మంచి అవకాశమని, గ్లోబల్‌గా ట్రేడ్ రికవరీ  పుంజుకుంటోందనీ, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు.  ఏదేమైనా, దేశాలు తమ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, విద్య, ఆరోగ్య రంగాల్లోకి  ఎక్కువ మంది ప్రజలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేరడానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు