టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుంది: ఉదయ్‌ కొటక్‌‌

27 May, 2020 20:03 IST|Sakshi

ముంబై: కరోనా ఉదృతి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ  నేపథ్యంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ ఉదయ్‌ కోటక్‌ ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ‍్యలు చేశారు. ఆయన స్పందిస్తూ.. కరోనా వల్ల అన్ని దేశాల అభిప్రాయాలు మారవచ్చని.. అది భారత్‌కు నూతన అవకాశాలకు మార్గం సుగుమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో దేశీయ టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతీయ యువతను నియమించుకోవాలని సూచించారు. టెక్‌ దిగ్గజం గూగుల్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమెరికన్‌ ఇంజనీర్లకు రూ. 2లక్షల డాలర్లు చెల్లిస్తుందని.. అదే భారతీయ యువతను నియమిస్తే తక్కువ వేతనంతో నైపుణ్యంతో పనిచేస్తారని తెలిపారు.

అయితే దేశీయ యువతను తక్కువ చేసే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచ సంక్షోభ నేపథ్యంలో తక్కువ వేతనంతో కంపెనీలకు అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు లభిస్తారని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా పీఎమ్ కేర్స్‌ పండ్‌, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇచ్చారు. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ సర్వే ప్రకారం 100 అత్యుత్తమ బ్యాంక్‌లో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పేరు నమోదవ్వడం విశేషం.

చదవండి: వృద్ధి కథ.. బాలీవుడ్‌ సినిమాయే!

   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా