ప్రపంచంలోనే అత్యంత చిన్న ‘కంప్యూటర్‌’

23 Jun, 2018 16:12 IST|Sakshi
ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్‌

వాషింగ్టన్‌ : బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? అయితే అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్‌ను మీరు చూడాల్సిందేనట. ఇది బియ్యం గింజ కంటే చిన్నదిగా ఉంది. ఈ డివైజ్‌ కేవలం 0.3 ఎంఎం మాత్రమే. మామూలు డెస్క్‌టాప్‌ల మాదిరిగా కాకుండా.. ఈ మైక్రోడివైజ్‌ను స్విచ్ఛాప్‌ చేయగానే దీనిలో ముందు చేస్తున్న ప్రొగ్రామింగ్‌, డేటా అంతా పోతుంది. అయితే దీన్ని కంప్యూటర్‌గా పిలువాలా? లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియదని ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ డేవిడ్ బ్లోవ్ అన్నారు. ఇది మామూలు కంప్యూటర్లతో పోలిస్తే పదింతలు చిన్నదిగా ఉంటుందని తెలిపారు. దీంతో తక్కువ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో తేలికగా బిగించవచ్చని పేర్కొన్నారు. దీన్ని మిచిగాన్‌ మైక్రో మోట్‌గా అభివర్ణించారు.

ఐబీఎం కూడా ప్రపంచంలో అ‍త్యంత చిన్న కంప్యూటర్‌ను తయారు చేసినట్టు మార్చిలో ప్రకటించింది. చిన్న పరిణామాల్లో సరికొత్త డివైజ్‌లను రూపొందిస్తూ.. నూతన ఒరవడికకు పరిశోధకలు ప్రాణం పోస్తున్నారు. ఈ చిన్న కంప్యూటర్ల విజయవంతంతో ఇతర రంగాల్లో పరిశోధనలకు కూడా బార్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. కన్నులు, క్యాన్సర్‌ స్టూడియోలు, ఆయిల్‌ రిజర్వాయర్‌ మానిటరింగ్‌, బయోకెమికల్‌ ప్రాసెస్‌ మానిటరింగ్‌, వంటి వాటిల్లో ఈ చిన్న డివైజ్‌లను వాడుకోవచ్చని మిచిగాన్‌ యూనివర్సిటీ చెప్పింది. పరిమిత ఫీచర్లనే ఇది కలిగి ఉంది. ఆంకాలజి రీసెర్చ్‌లో ఈ డివైజ్‌ ఎంతో సాయపడనుందని, క్యాన్సర్ కణాలు పెరుగుతున్న దశలో దీన్ని మౌజ్‌లోకి చొప్పించాల్సి ఉంటుందని రేడియోలజీ, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ యూఎం ప్రొఫెసర్‌ గ్యారీ లూకర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు