ప్రపంచంలో మోస్ట్ కాస్ట్లీ వజ్రం ఇదే!

10 May, 2016 16:46 IST|Sakshi
ప్రపంచంలో మోస్ట్ కాస్ట్లీ వజ్రం ఇదే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రఫ్ డైమండ్  63 మిలియన్‌ డాలర్ల (రూ. 419 కోట్ల)కు అమ్ముడుపోయింది. 813 క్యారెట్ల ఈ వజ్రాన్ని కెనడీయన్ మైనింగ్ కార్పొరేషన్ లుకారా వెలికితీయగా.. దీనిని దుబాయ్ కు చెందిన నెమిసిస్ ఇంటర్నేషనల్ డీఎంసీసీ సొంతంచేసుకుంది. రఫ్ జెమ్ గా బాగా ప్రాచుర్యం పొందిన ఈ వజ్రానికి 'కాన్స్టిలేషన్ డైమండ్' గా పేరుంది.

లుకారా అమ్మకానికి పెట్టిన ఈ వజ్రం విలువ క్యారెట్ కు 77,649 డాలర్లు పలికింది. ఈ వజ్రానికి తుది మెరుగులు దిద్ది అమ్మకానికి పెట్టిన లుకారా, నికర లాభంలో 10శాతం వడ్డీని నిలుపుకున్నట్టు ప్రకటించింది. మార్కెట్ అంచనాలకంటే ఎక్కువ రేటే ఈ డైమండ్ కు వచ్చినట్టు లండన్ బీఎంవో క్యాపిటల్ మార్కెట్‌ లిమిటెడ్ తెలిపింది. కాగా, రెండో అతిపెద్ద వజ్రంగా పేరున్న 'లెసెడా లా రోనా' అమ్మకానికి కూడా లుకారా సిద్ధమైంది. వచ్చే నెలలో దీనిని వేలం వేయనున్నారు. టెన్నిస్ బాల్ సైజు కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఈ జెమ్, బరువు 1,111 క్యారెట్లు. ఈ రెండు డైమండ్లను బోట్స్వోనాకు చెందిన కారోవ్ మైన్ కంపెనీ లుకారా గతేడాది వెలికితీసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు