టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం

14 Aug, 2017 12:23 IST|Sakshi
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం

న్యూఢిల్లీ:  జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)  ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం   ఇది  1.88శాతంగా నిలిచింది.   వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్‌తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా  ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్‌ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది.   ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది.  ఫుడ్‌ ఇండెక్స్‌ మంత్‌ ఆన్‌మంత్‌ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం.

కూరగాయల ద్రవ్యోల్బణం  భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్‌ను రికార్డ్‌ చేసింది.  గత నెల ఇది 21.16 శాతంగా   నమోదైంది.  ప్రధానంగా టమాటా ధరలు  దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా.  ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌  4.37 శాతంగా నిలిచింది.  ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు ,  ఆహార ఉత్పత్తుల  ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో  వచ్చే ఆర్‌బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్‌ వర్గాలు వ్యక్తం చేశాయి.
 

మరిన్ని వార్తలు