టోకు ధరల మంట 

15 Nov, 2018 01:00 IST|Sakshi

అక్టోబర్‌లో 5.28 శాతం  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో టోకున ధరలు 5.28 శాతం పెరిగాయన్నమాట. టోకు ధరలు ఈ స్థాయిలో నమోదుకావడం వరుసగా ఇది నాల్గవనెల. 2017 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతంకాగా, గత ఏడాది అక్టోబర్‌లో  3.68 శాతంగా ఉంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలను చూస్తే.... 

►టోకున ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో అసలు పెరక్కపోగా 1.49 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు 18.65 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌ నెలలో ఈ తగ్గుదల 3.83 శాతం. అయితే ఆలూ ధరలు భారీగా 93.65 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 31.69 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలూ 13.92 శాతం తగ్గాయి.  

►ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌లో ధరల పెరుగుదల రేటు 18.44 శాతంగా ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్‌ ధరలు వరుసగా 19.85 శాతం, 23.91 శాతం చొప్పున పెరిగాయి.  

మరిన్ని వార్తలు