అమెరికా ప్రకటనపై డబ్ల్యూటీవో ఆందోళన

3 Mar, 2018 11:45 IST|Sakshi

జెనీవా : స్టీల్‌, అ‍ల్యూమినియం ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించనున్నట్టు అమెరికా అ‍ధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీఓ) డైరెక్టర్‌ జనరల్‌ రాబర్టో అజెవెడో ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ట్రేడ్‌ పాలసీ విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా అరుదు. అయినప్పటికీ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ట్రేడ్‌ వార్‌ జరిగే ప్రమాదం ఉందంటూ డబ్ల్యూటీఓ ఆందోళన వ్యక్త పరుస్తోంది. ట్రేడ్‌ వార్‌ జరుగాలని ఎవరూ కోరుకోవడం లేదని, పరిస్థితిని డబ్ల్యూటీఓ సునిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. ట్రంప్‌ ప్రకటనపై ఇతరులు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూస్తున్నామని తెలిపారు.

స్టీల్‌ దిగుమతులపై 25 శాతం సుంకాలు, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించిన అనంతరం ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ చాలా మంచిదని, తేలికగా గెలువవచ్చని పేర్కొన్నారు. దీంతో ట్రేడ్‌ వార్‌ జరిగే ప్రమాదముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రేడ్‌ వార్‌ సంకేతాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సైతం అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచ కుబేరుల సంపద ఇప్పటికే భారీగా కోల్పోయారు.ఈ ప్లాన్‌ఫై డబ్ల్యూటీఓ కమిటీ అంతకముందే విమర్శలు చేసింది. ఈ విషయంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కానీ ట్రంప్‌ టారిఫ్‌ ప్లాన్లు, సిస్టమ్‌కు దారుణమైన ప్రమాదంగా తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు