షావోమి సూపర్‌ డిస్కౌంట్‌

5 Feb, 2019 21:05 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి భారత్‌లోని తన వినియోగదారుల కోసం తాజాగా ఆఫర్లు ప్రకటించింది. రెడ్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. రూ. 2500 వరకు డిస్కౌంట్‌ ఇచ్చింది. ఈ నెల ఆరో తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని షావోమి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మానుకుమార్‌ జైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. షావోమి ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బుధవారం నుంచి తగ్గింపు ధరలతో రెడ్‌మీ 6 సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

తగ్గింపు తర్వాత ధరలు ఇలా ఉన్నాయి..
రెడ్‌మీ 6 ప్రొ 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ రూ.10,999
రెడ్‌మీ 6 ప్రొ 3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ రూ.8,999
రెడ్‌మీ 6ఎ 2 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ రూ.6,499
రెడ్‌మీ 6 3 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ రూ.8,499

మరిన్ని వార్తలు