భారీ విస్తరణ ప్రణాళికలో షావోమీ 

25 Apr, 2019 00:08 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమీ భారీ విస్తరణ ప్రణాళికలో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరినాటికి తన రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్యను 10,000కు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్స్‌ నుంచే 50 శాతం వ్యాపారం కొనసాగించేలా వ్యూహాలను సిద్ధంచేసినట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో 6,000 అవుట్‌లెట్లను కంపెనీ నిర్వహిస్తోంది. ‘మి హోమ్స్‌’, ‘మి ప్రిఫర్డ్‌ పార్ట్నర్‌’, ‘మి స్టోర్స్‌’ పేరిట మూడు ఫార్మాట్లలో ఈ స్టోర్లను కొనసాగిస్తోంది. తాజాగా బెంగళూరు, ముంబైలలో మి స్టూడియోస్‌ పేరుతో 400–600 ఎస్‌ఎఫ్‌టీ సగటు సైజ్‌ స్టోర్లను ప్రారంభించింది. ఇక రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం గతేడాది డిసెంబర్‌ నాటికి స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో షావోమీ 28.9 శాతం మార్కెట్‌ వాటాను        కలిగిఉంది. 

‘రెడ్‌మి వై3’@ రూ.9,999 
షావోమి తాజాగా ‘రెడ్‌మి వై3’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏప్రిల్‌ 30 నుంచి కస్టమర్లకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ హ్యండ్‌సెట్‌ 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.11,999గా తెలిపింది. ఇదే సమయంలో ‘రెడ్‌మీ 7’ ఆవిష్కరించింది. దీని ధర రూ.7,999 కాగా, ‘మి ఎల్‌ఈడీ స్మార్ట్‌ బల్బ్‌’ పేరుతో తన వెబ్‌ సైట్‌ ద్వారా  

మరిన్ని వార్తలు