షావోమి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ : ఈ నెలలోనే​

1 Jun, 2020 17:26 IST|Sakshi

  రెడ్‌మి నోట్‌బుక్ : జూన్‌​ 11న

సాక్షి, ముంబై:   చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమి  ఇక ల్యాప్‌ ట్యాప్‌  మార్కెట్లో  దూసుకపోయేందుకు సిద్ధమవుతోంది.  స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్‌బుక్‌ను భారతదేశంలో లాంచ్‌ చేయనుంది. షావోమి రెడ్‌మిబుక్  పేరుతో  దీన్ని ఈ నెల 11 వతేదీన  ఆవిష్కరించనుంది. (రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది..)

ఎంఐ నోట్‌బుక్ జూన్ 11న భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నట్లు  షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ సోమవారం ధృవీకరించారు. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఇండియాలోనే తయారు చేసిన వీటిని తీసుకొస్తున్నట్లు   ట్వీట్‌ చేశారు.  తద్వారా ల్యాప్‌టాప్ మార్కెట్లో హెచ్‌పీ ఆపిల్, డెల్, లెనోవా వంటి  టాప్‌  బ్రాండ్‌లతో కంపెనీ పోటీ పడాలని  షావోమి చూస్తోంది. (మరో సంచలనం దిశగా షావోమి)

ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ రాబోయే షావోమి ల్యాప్‌టాప్‌ 1సీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌కు మద్దతుతో,  35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ  రీఛార్జ్ చేయగలదని అంచనా.  

షావోమి రెడ్‌మి బుక్‌ ప్రత్యేకతలు
 13.3-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే (యాంటీ గ్లేర్ )
1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
10వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌  5, 7,
 ప్రాసెసర్లు ప్రధానంగా ఉండనున్నాయి.
 ఇక ధరల విషయానికి వస్తే..  రూ. 47,490, రూ. 54,800 ధర  వద్ద ప్రారంభం  కానున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు