అయిదేళ్లలో 10 కోట్లు

7 Sep, 2019 13:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరోసారి భారత్‌లో రికార్డు అమ్మకాలను సొంతం చేసుకుంది. గత ఐదేళ్లలో భారతదేశంలో 10 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను  షిప్పింగ్‌ చేశామని షావోమి  శుక్రవారం ప్రకటించింది. ఆరంభంనుంచి లక్షలాది ఎంఐఫ్యాన్స్‌ నుంచి తమకు  లభిస్తున్న ఆదరణకు  ఇది నిదర్శనమని కంపెనీ వ్యాఖ్యానించింది.

తమకంటే ముందు మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నా తాము సాధించిన ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించలేకపోయామని షావోమి ఎండీ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు. ఇందుకు తమ వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కంపెనీ సాధించిన ఈ ఘనతను ఉద్యోగులతో పంచుకున్నారు.  అంతేకాదు   తమ టీమ్‌ అంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న  వీడియోను ఒకదాన్ని ట్విటర్‌ లో షేర్‌ చేశారు.  

క్యూ 3 2014 - జూలై 2019  మధ్య 100 మిలియన్ల మైలురాయిని  షావోమి సాధించినట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. ముఖ్యంగా రెడ్‌మి ఎ,  రెడ్‌మి నోట్ సిరీస్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయని పేర్కొంది.  షావోమి వరుసగా ఎనిమిది త్రైమాసికాలలో భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఐడీసీ ప్రకారం 2019 క్యూ 2 లో  28.3 శాతం మార్కెట్ వాటాను కలిగి వుంది.  2019 క్యూ 2లోరెడ్‌మి 6 ఎ, రెడ్‌మి నోట్ 7 ప్రో  అత్యధికంగా  అమ్ముడైన రెండు స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయి.


 

మరిన్ని వార్తలు