ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ వచ్చేసింది..

27 Sep, 2018 13:36 IST|Sakshi
ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌

న్యూఢిల్లీ : షావోమి నేడు మరో సరికొత్త ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, లేజర్‌ సెన్సార్‌, 360 డిగ్రీల ట్రిపుల్‌ లేయర్‌ ఫిల్టర్‌తో ఈ డివైజ్‌ రూపొందించింది. ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్‌ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ అమెజాన్‌ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్‌ అసిస్టెంట్‌ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్‌ చేస్తుంది. 

ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ తొలి సేల్‌ను సెప్టెంబర్‌ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్‌, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షావోమి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2 ను కూడా రూ.8,999కే విక్రయిస్తున్నారు. 


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు