షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..

8 May, 2020 13:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి  చాలా రోజుల తరువాత  5జీ సపోర్టుతో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను  శుక్రవారం లాంచ్ చేసింది. షావోమి ఎంఐ 10 పేరుతో ఈ మొబైల్ ను  భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీంతోపాటు  వైర్ లెస్ చార్జర్,  ధర రూ. 2299 గా ఉంచింది. దీన్ని ప్రీ ఆర్డర్ చేస్తే రూ.1999కే లభ్యం.

4కే ఎంఐ పవర్ బ్యాంకును   కూడా  తీసుకొచ్చింది. దీని ధర రూ. 3499 గా  వుండనుంది. మే  12 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్ ద్వారా లభ్యం.

అలాగే  దేశంలో షావోమి తన వైర్ లెస్  ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. దీని లాంచింగ్ ధరను రూ. 3999గా  ఉంచింది. ఈ ఆఫర్ ముగిసిన తరువాత దీని ఎంఆర్ పీ ధర  రూ. 4499 గా ఉండనుంది.  మే 10 నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా లభ్యం.

షావోమి ఎంఐ 10 ఫీచర్లు
6.67అంగుళాల అమోలెడ్ డిస్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 విత్  అడ్రినో 650జీపీయు
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌
8 జీబీ ర్యామ్‌ 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ 
రియర్ క్వాడ్ కెమెరా
108 ఎంపీ ప్రైమరీ కెమెరా
13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంఎఈ డెప్త్ సెన్సార్ ,  2ఎంపీ మాక్రో లెన్స్
20 ఎంపీ సెల్పీ  కెమెరా
4780 ఎంఏహెచ్  బ్యాటరీ  


ఈ  (మే8 శుక్రవారం) రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే  ప్రీ ఆర్డర్   కోసం ఎంఐ కామ్, అమెజాన్, ద్వారా అందుబాటులో వుంటుంది. త్వరలోనే అన్ని రీటైల్ స్టోర్లలో లభ్యం కానుందని షావోమి వెల్లడించింది.   

ఆఫర్లు : 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు రూ. 3 వేల క్యాష్ బ్యాక్  
ప్రీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు  రూ. 2499  విలువ చేసే పవర్ బ్యాంకు ఉచితం.

8 జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్ రూ. 49,999 
8 జీబీ ర్యామ్‌ 256జీబీ స్టోరేజ్ ధర రూ. 54999

చదవండి : పెట్టుబడుల సునామీ : టాప్‌లోకి జియో
జియో హాట్రిక్ : మరో మెగా డీల్

Specifications

  • display
    6.67అంగుళాల అమోలెడ్ డిస్‌
>
మరిన్ని వార్తలు