వన్‌ప్లస్‌ 6 రికార్డులను బద్దలుకొట్టిన ఎంఐ 8

26 Jun, 2018 13:25 IST|Sakshi

వన్‌ప్లస్‌ కంపెనీ తాజాగా లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన షావోమి ఎంఐ 8 బద్దలు కొట్టింది. లాంచ్‌ అయిన కొన్ని రోజుల్లో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ 8, పది లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని చేధించడానికి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌కు కేవలం 18 రోజుల్లో పట్టిందని కంపెనీ తెలిపింది. జూన్‌ 5న తొలిసారి షావోమి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్‌ అధికార ప్రతినిధి డోనోవాన్‌ సంగ్‌ ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు. ‘జూన్‌ 5న ఎంఐ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారి విక్రయానికి వచ్చింది. కేవలం 18 రోజుల్లోనే మేము 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేశాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  ఈ మైలురాయిని చేరుకోవడానికి వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌కు 22 రోజుల సమయం పట్టింది. అంటే వన్‌ప్లస్‌ 6 రికార్డులను ఎంఐ 8 బద్దలు కొట్టేసిందన్న మాట.

ఇక ఎంఐ 8 ఫీచర్ల విషయానికి వస్తే..
6.21 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ నాచ్డ్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది
2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌తో గ్లాస్‌, మెటల్‌ డిజైన్‌తో రూపొందింది
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌
64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యం
12 ఎంపీ + 12 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు
20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత్‌కు కూడా రాబోతుంది. 
 

>
మరిన్ని వార్తలు