ఆశ్చర్యకర ఆఫర్‌ ప్రకటించిన షావోమి

20 Dec, 2018 19:36 IST|Sakshi

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు షావోమి ఆశ్చర్యకర ఆఫర్‌ ప్రకటించింది. పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధరపై 3 వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే వారికి ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. 2018 సంవత్సరానికి సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ప్రకటించిన టెక్‌, ఆటో అవార్డుల్లో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ‘బెస్ట్‌ బడ్జెట్‌ ఫోన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికైంది.

అవార్డు వచ్చిన సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్టు షావోమి ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మానుకుమార్‌ జైన్‌ తెలిపారు. ఎంఐ, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వెబ్‌సైట్లలో ఈ ఆఫర్‌ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటివరకు ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫీచర్లు...
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్డీ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు