భారీ ప్రణాళికలతో దూసుకొస్తున్న షావోమి

12 Dec, 2017 10:36 IST|Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన  చైనా కంపెనీ షావోమి మరింత శరవేగంగా దూసుకొస్తోంది.  భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్‌ బ్యాంక్‌ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్‌ నివేదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే  కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్‌ సేవలను అందించనుందనీ ఈ మేరకు  రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ ఫైలింగ్‌లో తెలిపిందని పేర్కొంది.

ఆర్‌ఓసీలో  షావోమి  దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్‌ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్‌ బ్యాంకు, లీజింగ్‌ అండ్‌  ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్‌ గేట్‌ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్‌వర్క్‌ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కష్టాలు :  ఓలా ఏం చేసిందంటే...

లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..

మార్కెట్లకు స్వల్ప నష్టాలు

లేబర్‌ సెస్‌ను వాడుకోండి!

‘శక్తి’మాన్‌.. బ్రహ్మాస్త్రం!

సినిమా

లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి

కరోనాపై పోరు: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’