పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది: జియో భారీ ఆఫర్‌

22 Aug, 2018 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ షావోమి సబ్‌బ్రాండ్ పోకో స్మార్ట్‌ఫోన్‌ అభిమానులకు ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళితో వస్తోంది. భారత మార్కెట్‌లోకి సరికొత్త పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  భారత్‌లో పోకో ఫోన్ ఎఫ్1 ప్రారంభ ధర రూ.20999గా నిర్ణయించింది. ఆగస్టు, 29 మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయానికి లభించనుంది. ఇక లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే రిలయన్స్‌ జియో భారీ ఆఫర్‌ అందిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రూ.8 వేల తక్షణ ప్రయోజనాలను కస‍్టమర్లకు ఆఫర్‌ చేయనుంది. అదీ 6టీబీ హైస్పీడ్‌ డేటాతో. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌ఎసీ కార్డు ద్వారా కొనుగోళ్లపై  వెయ్యి రూపాయల తగ్గింపును అందించనుంది.

పోకో  ఎఫ్‌ 1 ఫీచర్లు
6.18 అంగుళాల డిస్‌ప్లే
1080x2160  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్ 845
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా,
4000ఎంఏహెచ్ బ్యాటరీ
మాస్టర్‌ ఆఫ్‌ స్పీడ్‌ గా ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితరఫీచర్లతో  బ్లూ, గ్రే రంగుల్లో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  తెలిపింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం

దేశీ స్టార్టప్‌లకు చైనీస్‌ దన్ను

చమురు తెచ్చిన లాభాలు

రూ.12,000 కోట్లను పంప్‌ చేయనున్న ఆర్‌బీఐ

లాభపడిన రూపాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలి ప్రేయసిని కలిశాను

నన్ను టార్గెట్‌ చేయొద్దు

నవ్వుల పార్టీ 

చాలా  నేర్చుకోవాలి

స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త మృతి

అది శాపం...  వరం  కూడా!