రెడ్‌మి నోట్‌ 5 ఆఫ్‌లైన్‌గా...

1 Mar, 2018 20:21 IST|Sakshi

ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన నిమిషాల్లో అవుటాఫ్‌ స్టాక్‌ అవుతున్న రెడ్‌మి నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇక నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ప్రకటించింది. గత నెలలోనే రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లను షావోమి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్‌ చేసిన అనంతరం వీటిని ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన ప్రతీసారి ఈ స్మార్ట్‌ఫోన్లు నిమిషాల్లోనే అవుటాఫ్‌ స్టాక్‌ అవుతున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్‌ రిటైల్‌ పార్టనర్ల వద్ద అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. 

ప్రస్తుతం రెడ్‌మి నోట్‌ 5 ప్రీ-బుకింగ్స్‌ను ఆఫ్‌లైన్‌ స్టోర్ల వద్ద షావోమి ప్రారంభించింది. వీటి డెలివరీని మార్చి 8 నుంచి మొదలుపెడుతుంది. రెండు వేల రూపాయలు కట్టి ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చని రిటైల్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాక త్వరలో ఆఫ్‌లైన్‌ రిటైల్‌ పార్టనర్ల వద్ద విక్రయానికి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఆన్‌లైన్‌ కంటే రూ.500 ఎక్కువగా ఉండనుంది. థర్డ్‌ పార్టీ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్ల ద్వారా రెడ్‌మి నోట్‌ 5ను కొనుగోలు చేస్తే, 3జీబీ ర్యామ్‌, 32జీబీ మోడల్‌ ధర 10,499 రూపాయలు. అసలు ఆన్‌లైన్‌గా ఈ మోడల్‌ ధర 9,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను ఆఫ్‌లైన్‌గా 12,499 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఆన్‌లైన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.11,999గా ఉంది. అదేవిధంగా రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధర కూడా ఆన్‌లైన్‌గా కంటే ఆఫ్‌లైన్‌గా 500 రూపాయలు ఎక్కువగా ఉండనుంది.


షావోమి  రెడ్‌మి నోట్ 5 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 ఎంపీ బ్యాక్ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షావోమి  రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు