అదిరే ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 6 ప్రో

20 Nov, 2018 19:34 IST|Sakshi
రెడ్‌మి నోట్‌ 6ప్రో

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను పొందుపరుస్తూ చైనా మొబైల్‌ తయారీదారు షావోమీ వినియోగదారుల ఆదరణను పొందింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన రెడ్‌మి నోట్‌ 5ప్రో కి కొనసాగింపుగా రెడ్‌మి సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌  ‘రెడ్‌మి నోట్‌ 6ప్రో’ ను తీసుకొస్తోంది.  ముందూ, వెనుక నాలుగు కెమెరాలతో  ఈ డివైస్‌ను ఈ నెల 23న మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీనిని మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నారు.  దీని ఫీచర్లు ప్రధానంగా ఇలా ఉండనున్నాయి. 
6.26 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 636 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ  స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
20+2 ఎంపీ రియర్‌ కెమెరాలు
12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే సుమారు రూ.15వేల లోపు ధరను నిర్ణయించే అవకాశం ఉందని అంచనా.

>
మరిన్ని వార్తలు