పేలిన రెడ్‌మి నోట్‌ స్మార్ట్‌ఫోన్‌

22 Nov, 2019 08:35 IST|Sakshi

పేలిన  రెడ్‌మి నోట్ 7 ఎస్‌

చార్జింగ్‌లో లేకుండానే అకస్మాత్తుగా మంటలు

తమ లోపం కాదంటున్న కంపెనీ

సాక్షి,ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి, భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్నషావోమికి మరోసారి పేలుడు షాక్‌ తగిలింది. షావోమి పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌  ‘రెడ్‌మి నోట్‌ 7ఎస్‌’ ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. అంతేకాదు చార్జింగ్‌లో లేకుండానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే షావోమి మాత్రం   ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్‌ తప్పిదం వల్లే ఇలా జరిగివుంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది. 

ముంబైకి చెందిన ఈశ్వర్ చావన్ తనకెదురైన చేదు అనుభవాన్నిసోషల్‌ మీడియాలో పంచుకున్నారు. రెడ్‌మి నోట్ 7ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  కొనుగోలు చేసినట్లు చావన్ ట్వీట్‌లో వివరించారు. ‘కొత్త ఫోన్‌ ఆఫీసు టేబుల్‌ మీద పెట్టాను. సడన్‌గా ఏదో కాలుతున్న వాసన గమనించాను. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో లేదు’ అని తెలిపారు. అంతేకాదు.. తన ఫోన్ ఎపుడూ కింద కూడా పడలేదని గుర్తు చేసు​కున్నారు. వెంటనే ఆయన థానేలోని షావోమి అధీకృత దుకాణాన్ని సంప్రదించారు. ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో కొంత సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చావన్ పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగి వుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. 

అయితే షావోమీ స్పందిస్తూ..నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత యిస్తామని, గత అయిదేళ్లుగా అభిమానులుతమ బ్రాండ్‌పై చూసిన అభిమానానికి ఇది నిదర్శనమని తెలిపింది. తాజా ఘటనను పరిశీలించిన తరువాత, బాహ్య  పరిస్తితుల కారణంగానే నష్టం జరిగిందని తేల్చి పారేసింది. 'కస్టమర్ ప్రేరిత నష్టం' గా భావిస్తున్నట్టుగా  పేర్కొంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా