బ్యాంకు సీఈవోకు ఎక్స్‌టెన్షన్‌ : షేరు ఢమాల్‌

31 Aug, 2018 12:26 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్‌ బ్యాంకు షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది.  శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. సీఈవో రాణా కపూర్‌ పదవిలో కొనసాగేందుకు ఆర్‌బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎస్‌బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం. ఆరంభంలోనే 5శాతం నష్టంతో టాప్‌ విన్నర్‌గా నిలిచింది.  అమ్మకాలు మరింత పెరగడంతో ఎస్‌బ్యాంకు షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది.  అనంతరం కొద్దిగా కోలుకుని 6శాతం నష్టాలకు పరిమితమైంది.

ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాణా కపూర్‌ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతి లభించినట్టు ఎస్‌ బ్యాంకు తెలిపింది. తదుపరి నోటీస్‌ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగనున్నారని గురువారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపక సీఈవోగా రాణా కపూర్‌ 2004 నుంచీ కొనసాగుతున్నారు.  సీఈవోగా ఆయన పదవీ కాలం నేటితో(ఆగస్టు 31) ముగియనుంది. ఈ ఏడాది జూన్‌లో యస్‌ బ్యాంక్‌ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్‌ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు.

మరిన్ని వార్తలు