యస్ బ్యాంకు.. 30 శాతం జంప్

19 Apr, 2017 18:16 IST|Sakshi
యస్ బ్యాంకు.. 30 శాతం జంప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంకు లాభాల్లో అదరగొట్టింది. అంచనాలను బీట్ చేసింది. 30.2 శాతం జంప్ చేసిన బ్యాంకు క్యూ4 లాభాలు, రూ.941.1 కోట్లగా నమోదుచేసింది. 2017 మార్చి 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బ్యాంకు బుధవారం ప్రకటించింది.  గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభాలు రూ.702.10 కోట్లగా ఉన్నాయి. ఈ ఫలితాల్లో బ్యాంకు లాభాలు 30.2 శాతం జంప్ అ‍వ్వగా.. నికర వడ్డీ ఆదాయాలు 32.1 శాతం పెంచుకుంది. ఈ ఆదాయాలు రూ.1,639.70 కోట్లగా నమోదయ్యాయి.
 
కాగ, బ్యాంకు నికరలాభాలు 875 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. మొత్తంగా బ్యాంకు ఆదాయం 56.6 శాతం పెరిగి, రూ.1257.40 కోట్లగా ఉన్నట్టు యస్ బ్యాంకు ప్రకటించింది. కానీ బ్యాంకు నికర ఎన్పీఏలు గతేడాది కంటే భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 342.5 కోట్లగా ఉన్న ఎన్పీఏలు ఈ ఆర్థికసంవత్సరం ప్రస్తుతం త్రైమాసికంలో 1072.3 కోట్లగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అదేవిధంగా స్థూల ఎన్పీఏలు రెడింతలు కంటే పెరిగాయని తెలిపింది. ఈ ఎన్పీఏలు 2018.5కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది.  
మరిన్ని వార్తలు