యస్ బ్యాంకు క్విప్ వాయిదా..

9 Sep, 2016 01:57 IST|Sakshi
యస్ బ్యాంకు క్విప్ వాయిదా..

న్యూఢిల్లీ: బిలియన్ డాలర్ల నిధుల సేకరణ ప్రతిపాదనను యస్ బ్యాంకు అనూహ్యంగా వాయిదా వేసుకుంది. ‘క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) కొత్త మార్గదర్శకాలను అపార్థం చేసుకోవడం వల్ల గురువారం నాటి మార్కెట్ ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రతిపాదిత క్విప్ వాయిదా వేసుకోవాలని మర్చంట్ బ్యాంకర్లు సూచించారు’ అని యస్ బ్యాంకు తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో యస్ బ్యాంకు షేరు 5.32 శాతం నష్టపోయి రూ.1,330 వద్ద క్లోజ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి క్విప్ విధానంలో బిలియన్ డాలర్లు సేకరించనున్నట్టు ఈ ఏడాది మేలో యస్ బ్యాంకు సీఈవో రాణాకపూర్ ప్రకటించారు. నిధుల సేకరణకు వీలుగా బ్యాంకులో విదేశీ ఇన్వెస్టర్ల వాటాను 74 శాతం వరకు పెంచుకునేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు