భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

20 Jun, 2019 16:19 IST|Sakshi

ముంబై : రుతుపవనాల రాకపై స్పష్టత రావడంతో పాటు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రారంభ నష్టాలను అధిగమించి ఫైనాన్షియల్‌ సహా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మెటల్‌ రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 489 పాయింట్ల లాభంతో 39,602 పాయింట్ల వద్ద ముగియగా,  140 పాయింట్లు లాభపడిన నిఫ్టీ  11,831 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ సహా పలు షేర్లు భారీగా లాభపడ్డాయి. కొనుగోళ్ల జోరుతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ ఏకంగా వంద శాతం పైగా పెరిగింది.

>
మరిన్ని వార్తలు