స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి పెప్సీ

14 Oct, 2015 00:35 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి పెప్సీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శీతల పానీయాలు, ఆహారోత్పత్తుల తయారీ దిగ్గజం పెప్సి స్మార్ట్ ఫోన్ల విపణిలోకి ప్రవేశిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలోని వీబో సోషల్ మీడియా సైట్‌లో పెప్సి ఫోన్ బ్యానర్ ప్రత్యక్షమైంది. ఇదే వెబ్‌సైట్లో పెప్సి విడుదల చేయనున్న తొలి మోడల్ సైతం దర్శనమిస్తోంది. వెబ్‌సైట్ వివరాల ప్రకారం ‘పెప్సి పి1’ పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల స్క్రీన్, 1.7 గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లుగా ఉన్నాయి.

బీజింగ్‌లో అక్టోబరు 20న ఇది విడుదల కానున్నట్టు సమాచారం. ధర 200 డాలర్లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లను హువావె తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. మొబైల్స్‌తోపాటు యాక్సెసరీస్‌లోకి పెప్సి ప్రవేశిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల రంగం ప్రపంచవ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతోంది. రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సాధించిన పెప్సీకి ఈ అంశమే ఆకట్టుకుంది. మొబైల్స్ విక్రయాలు చైనాకు పరిమితం కానున్నాయని పెప్సి ప్రతినిధి ఒక  అంతర్జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు