ఈ స్వీట్‌ బాంబులు..హాట్‌ కేకులే!

19 Oct, 2019 18:22 IST|Sakshi

జోధ్‌పూర్‌లో స్వీట్ల బాంబులు

హాట్‌ కేకుల్లా స్వీట్‌ క్రాకర్స్‌

సాక్షి,జోధ్‌పూర్‌ : దీపావళి అంటేనే  స్వీట్లు, క్రాకర్స్‌ పండుగ. అయితే ఈ దీపావళి పండుగకు కూడా ఉత్త లడ్డూలు, జిలేబీలు, జామూన్లు ఏంటి బోర్‌... సమథింగ్‌ ఇస్మార్ట్‌ అనుకున్నారో ఏమో కానీ... రాజస్థాన్‌లోని వ్యాపారులు స్వీట్‌ తయారీదారులు సరికొత్తగా ఆలోచించారు. పండుగవేళ వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బాంబులతో స్వీట్లు పేల్చారు. అదేనండీ..  దీపావళి క్రాకర్స్‌ మాదిరిగా స్వీట్లను తయారు చేసారు.

సుత్లీ బాంబులు, లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు లాంటి దీపావళి క్రాకర్స్‌ తరహాలో స్వీట్లను రూపొందించారు. అయితే దీపావళి క్రాకర్స్‌అనుకొని కొనడానికి వచ్చిన కస్టమర్లు.. క్రాకర్ల ఆకారంలో ఉన్న స్వీట్లను  చూసి బహు ముచ్చటపడిపోతున్నారుట.  దీంతో  'క్రాకర్ స్వీట్స్' అమ్మకాలు జోరందుకున్నాయి.  ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకుంటూ  హాట్‌కేక్‌ల మాదిరిగా అమ్ముడవుతున్నాయి. 

సాధారణంగా దీపావళికి స్వీట్లకు మంచి ఆదరణ లభిస్తుందని జోధ్‌పూర్‌లోని సర్దార్‌పురా దుకాణదారులు చెబుతున్నారు. సుమారు ఒక నెల సమయంనుంచే స్వీట్ల తయారీలో నిమగ్నమై పోతామని  చెప్పారు. అంతేకాదు, స్వచ్ఛమైన నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో ఎలాంటి కల్తీ లేకుండా తయారుచేస్తారట, అందుకే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట. ఈ సంవత్సరం దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 27న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ఏంటి?

దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..

ఆనందాల వెలుగులు నిండాలి

ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం

వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి