రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ క్లబ్‌లోకి ఎన్‌టీఆర్‌

12 Jul, 2018 17:06 IST|Sakshi

మొబైల్‌ రిటైల్‌ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్‌ సంస్థ సెలెక్ట్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ స్టార్‌ను నియమించుకుంది. ప్రముఖ స్టార్‌ హీరో, యంగ్‌ టైగర్‌ ఎన్‌టీఆర్‌ను తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ఈ కంపెనీ చెప్పింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జూలై 13న మూడు గంటలకు హైటెక్‌ సిటీలోని ఐటీసీ కోహెనుర్‌లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను, సన్నిహిత వర్గాలను సెలెక్ట్‌ మొబైల్స్‌ ఆహ్వానిస్తోంది. త్వరలోనే ఎన్‌టీఆర్‌ ఈ బ్రాండ్‌ కోసం షూట్‌ కూడా చేయనున్నారని తెలిసింది.

ఎన్‌టీఆర్‌ను సెలెక్ట్‌ మొబైల్స్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడంతో, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ క్లబ్‌లోకి జూనియర్‌ ఎన్‌టీఆర్‌ కూడా చేరిపోయారు. రామ్‌ చరణ్‌ హ్యాపీ మొబైల్స్‌కు, అల్లు అర్జున్‌ లాట్‌ మొబైల్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి, హైదరాబాద్‌లో స్టోర్లను ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ మొబైల్స్‌ తన కంపెనీ  కార్యకలాపాలను ప్రారంభించింది. తొలుత దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పింది. ఆ అనంతరం ఉత్తర భారత్‌పై ఫోకస్‌  చేయనున్నట్టు పేర్కొంది. ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లను ఫిజికల్‌ స్టోర్లలో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని ఈ కంపెనీ చెబుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా