యప్‌టీవీ స్మార్ట్‌ టీవీ ఆఫర్‌ విజేతలు వీరే..

19 Jun, 2020 15:48 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం యప్‌టీవీ ఇటీవల ప్రవేశపెట్టిన స్మార్ట్‌ టీవీ (55 ఇంచెస్‌) ఆఫర్‌ విజేతలను ప్రకటించింది. తమ వార్షిక ప్యాకేజ్‌లను కొనుగోలు చేసిన వారిలో లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి జూన్‌ తొలివారం విజేతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులకు 12కి పైగా భాషల్లో భారత టీవీ ఛానెల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గత పదేళ్లుగా ఈ సేవలను అందిస్తున్న యప్‌టీవీ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకటిగా నిలిచింది. యప్‌ టీవీపై వీక్షకులు ప్రస్తుతం హిందీ, తమిళ్‌, తెలుగు, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా ఇతర భారతీయ భాషల్లో వినోదాన్ని కేవలం కొద్ది డాలర్లు వెచ్చించి ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది.

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో రెండు నెలల పాటు తమిళ, మళయాళం వంటి కొన్ని భాషల్లో తాజా కంటెంట్‌ కొరవడిన క్రమంలో ప్రస్తుతం​తాజా కంటెంట్‌ అందుబాటులోకి రాగా, తెలుగు, బెంగాలీ, హిందీ చానెల్స్‌ త్వరలోనే అన్ని షోలు, కార్యక్రమాలకు సంబంధించిన తాజా కంటెంట్‌తో ముందుకు రానున్నాయి. ఇక స్మార్ట్‌ టీవీ ఆఫర్‌లో విజేతల వివరాలు చూస్తే..అమెరికా నుంచి పట్టాభిరాజు ముండ్రు (పెన్సిల్వేనియా), శ్రావ్య గొట్టిపాటి (కాలిఫోర్నియా), ఎల్‌ సుబ్రమణియన్‌ (వర్జీనియా), రమేష్‌ టిమకొందు (కనెక్టికట్‌), ఆర్ముగం పళనిస్వామి (మిచిగాన్‌), బ్రిటన్‌ నుంచి హనుమంతరావు విడదల (లాంక్‌షైర్‌), యూరప్‌ ప్రాంతం నుంచి కిషోర్‌ రావూరి (స్విట్జర్లాండ్‌), సమంతా కర్బందా (సింగపూర్‌), ఆస్ట్రేలియా నుంచి సునీల్‌ కుమార్‌ నూతి (న్యూ సౌత్‌వేల్స్‌) ఎంపికై స్మార్ట్‌ టీవీలను గెలుచుకున్నారని యప్‌టీవీ వెల్లడించింది.

చదవండి : ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్‌ టీవీ జోడీ..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు