జీ కొత్త వ్యూహాలు : 50శాతం వాటా అమ్మకం

14 Nov, 2018 13:53 IST|Sakshi
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో పునీత్‌ గోయెంకా (ఫైల్‌ ఫోటో)

వ్యూహాత‍్మక పెట్టుబడుల ఉపసంహరణ

విదేశీ కొనుగోలుదారుకోసం అన్వేషణ

గ్లోబల్‌గా మరింత విస్తరించాలని ప్లాన్‌

సాక్షి, ముంబై:  ఎస్సెల్‌ గ్రూప్‌లోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో  మేజర్‌ వాటాను ప్రమోటర్ల విక్రయించనున్నారు.  మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ,సుభాష్‌ చంద్ర ప్రమోటర్‌గా తమ వాటాలో సగభాగాన్ని విక్రయించనున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వ్యూహాత్మక బిజినెస్‌ ప్రణాళికల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌నకున్న వాటాలో సగభాగాన్ని విదేశీ సంస్థకు విక్రయించనున్నట్లు  పేర్కొంది.

జీ గ్రూప్‌ను గ్లోబల్‌ మీడియా టెక్‌ సంస్థగా రూపొందించే బాటలో అంతర్జాతీయ భాగస్వామికి ప్రమోటర్ల వాటాలో సగభాగం వరకూ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఈ వాటా విక్రయ అంశంలో సలహాల కోసం అడ్వయిజర్లతో సమావేశమైనట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.  ఈ బాటలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ సెక్యూరిటీస్‌, లయన్‌ ట్రీ సంస్థలను అంతర్జాతీయ వ్యూహాత్మక సలహాదారుగా నియమించాలని నిర్ణయించింది.  ఇది  2019 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ముగించాలని భావిస్తోంది.సెప్టెంబర్‌ నాటికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో  ఎస్సెల్‌ గ్రూప్‌ 16.5 శాతం వాటాను కలిగి ఉంది. 
 బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌లో తమ బలం తెలుసు.  ఇప్పటికే జీ 5 మార్కెట్లో రెండవ  అతిపెద్ద ప్లేయగా ఉంది.. కానీ ప్రపంచ లక్ష్యాలు సాధించడానికి  నిర్ణయం తీసుకున్నామని  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్‌ గోయెంకా అన్నారు.  అలాగే మైనారిటీ వాటాదారుల దీర్ఘకాలిక  ప్రయోజనాలు  రాబోయే సమయంలో మరింత మెరుగవుతాయని  ఆయన చెప్పారు  

మరోవైపు ప్రమోటర్ల వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.  తొలుత 4 శాతం పతనమైంది. వెంటనే కొనుగోళ్ల తిరిగి జోరందుకుంది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 455 ఎగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 470 వరకూ ఎగసింది. 

మరిన్ని వార్తలు