తగ్గుతున్న జన ధన యోజన ఖాతాలు

12 Mar, 2016 01:34 IST|Sakshi
తగ్గుతున్న జన ధన యోజన ఖాతాలు

ఎస్‌బీఐ చైర్ పర్సన్ వెల్లడి
ముంబై: జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్య ప్రారంభించడం తగ్గుతోందని ఎస్‌బీఐ తెలిపింది. ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా అందరికీ బ్యాంక్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జనధనయోజన(పీఎంజేడీవై) పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను బ్యాంక్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించడం క్రమక్రమంగా తగ్గుతోందని, మొత్తం ఖాతాల సంఖ్య 46 శాతానికి తగ్గిందని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక సిబిల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీఎంజేడీవై కార్యక్రమం లాంఛనంగా ముగింపుకు వస్తోందని, అయితే బ్యాంకింగ్ సౌకర్యాలు అందని ప్రజలు చాలా మంది ఉన్నారని వివరించారు. ఈ అకౌంట్ల ప్రారంభించడానికి రూ.20 చొప్పున నామమాత్ర రుసుము వసూలు చేస్తున్నామని తెలిపారు. ఇలా వసూలు చేయడం ప్రభుత్వానికి నచ్చలేదని అయితే ఉచితంగా ఇచ్చినా ఒక విలువ ఉంటుందని ప్రజలకు అర్థం కావడానికే ఈ నామమాత్ర రుసుమును వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలా వసూలు చేసిన ఖాతాలకు చెందిన ఖాతాదారుల్లో పలువురు తమ ఖాతాల్లో  కనీసం రూ. 500 బ్యాలెన్స్‌ను నిర్వహిస్తున్నారని వివరించారు. క్రెడిట్ బ్యూరో సంస్థల రాకవల్ల బ్యాంకులకు రుణాలు ఇవ్వడం సులభం, వేగవంతం అవుతోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు