జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

14 Sep, 2019 10:55 IST|Sakshi

ఈ నెల 16 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వీడియో కంటెంట్‌ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 16 నుంచి వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో యాప్‌లో వీడియోస్‌ అనే ట్యాబ్‌ నుంచి వీటిని చూడొచ్చని కంపెననీ తెలిపింది. 18 ఒరిజినల్‌ షోలను వచ్చే మూడు నెలల కాలంలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ షోలు అన్నీ కూడా ఆహారానికి సంబంధించినవేనని కూడా స్పష్టం చేసింది. 3–15 నిమిషాల వరకు వీడియోల నిడివి ఉంటుందని వివరించింది. ‘‘ఒరిజినల్‌ షోలపై ఇన్వెస్ట్‌ చేశాం. ఫిక్షన్, నాన్‌ ఫిక్షన్‌కు సంబంధించి భిన్నమైన షోలనూ రూపొందించేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించాం’’ అని జొమాటో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దుర్గా రఘునాథ్‌ తెలిపారు. హిందీ, ఇంగ్లీషులో ఉండే ఈ షోలతో దేశంలోని అన్ని ప్రాంతాలను చేరుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు