జొమాటో ఉద్యోగుల కోసం టాలెంట్‌ డైరెక్టరీ

30 May, 2020 22:23 IST|Sakshi

ముంబై: ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కరోనా  సంక్షోభం నేపథ్యంలో 520 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థ పై తీవ్ర ప్రభావం పడిందని.. వ్యాపారాలు బాగా దెబ్బతిన్నందు వల్ల ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఎంతో మంది నైపుణ్యమున్న వ్యక్తులు కృషి చేయడం వల్లే జొమాటో సంస్థ విజయవంతయ్యిందని తెలిపారు. జొమాటో సంస్థలో నైపుణ్యం ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం జొమాటో టాలెంట్‌ డైరెక్టరీ అనే అభ్యర్థి ప్రొఫైల్‌ లిస్ట్‌ను సంస్థ రూపొందించినట్లు దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

ఈ పోర్టల్‌ ద్వారా అభ్యర్థులలో దాగి ఉన్న అన్ని నైపుణ్యాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కాగా తమ సంస్థలో వివిధ విభాగాలలో పని చేసిన ప్రతిభావంతమయిన ఉద్యోగుల జాబితా కోసం  talentdirectory@zomato.comకు మెయిల్‌ చేయాలని సూచించాడు. జొమాటో సంస్థను ఎంతో మంది అభిరుచుల ఉన్న వ్యక్తులతో ప్రారంభించామని దీపిందర్‌ అన్నారు. సంస్థ అభివృద్ధికి నిరంతరం వారు పాటుపడ్డారని కొనియాడారు. ముఖ్యంగా వీడియో ఎడిటర్స్‌, డిజైనర్స్‌, కంటెంట్‌ ప్రొడ్యూసర్స్‌ లాంటి వివిధ విభాగాల ప్రతిభావంత వ్యక్తుల జాబితాను చూడవచ్చని సంస్థలకు జొమాటో ప్రతినిధులు సూచించారు.

చదవండి: ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్‌ కాస్త సెలబ్రిటీ

మరిన్ని వార్తలు