సరికొత్త వెర్షన్‌లో జూమ్‌ యాప్‌..

28 May, 2020 15:47 IST|Sakshi

అమెరికాకు చెందిన జూమ్‌ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ యాప్‌ యూజర్లకు అనుకూలంగా వీడియా సెషన్స్‌ అందిస్తోంది. ప్రస్తుతం జూమ్‌ యాప్‌ యూజర్లకు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో సేవలందిస్తోంది. తాజాగా జూమ్‌ యాప్‌పై కొన్ని ఆరోపణలు నేపథ్యంలో సరికొత్త రీతిలో యూజర్లను అలరించడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో జూమ్‌ కంపెనీ మే 30, 2020లో ఇన్‌స్టాల్‌ అయ్యే నూతన వెర్షన్‌నే ఉపయోగించాలని కోరింది. ప్రస్తుతం కంపెనీ జూమ్‌ రూమ్స్‌, సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ సేవలను  యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్‌ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్‌ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. జూమ్‌ యాప్‌ తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందిస్తున్నందున ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి ఎక్కువ స్థాయిలో యూజర్లు ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు.

యూజర్లకు అన్ని కొత్త  వెర్షన్లు రావాలంటే అడ్మిన్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి జూమ్‌ రూమ్స్‌ కంట్రోలర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవలని కంపెనీ సూచించింది. మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్‌ చుగ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్‌ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్‌, సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్‌దారుడు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు