ఉచితంగా అందించలేం: జూమ్‌ సీఈఓ

3 Jun, 2020 17:24 IST|Sakshi

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. లాక్‌డౌన్‌ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్‌ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్‌ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశామని.. అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్‌ చేసుకోవాలని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్‌‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు.

యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్‌ యాప్‌ AES 256-bit జీసీఎమ్‌ అనే కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్‌ రూమ్స్‌, సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్‌ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్‌ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

చదవండి: హైదరాబాద్‌: సిటీ బస్సులకూ ఇక రైట్‌ రైట్‌!

సరికొత్త వెర్షన్‌లో జూమ్‌ యాప్‌..


 

మరిన్ని వార్తలు