-

ఈ ఫోన్ కు 13ఎంపీ సెల్ఫీ కెమెరా...

5 Jul, 2016 18:21 IST|Sakshi
ఈ ఫోన్ కు 13ఎంపీ సెల్ఫీ కెమెరా...

నుబియా జెడ్11 ప్రవేశపెట్టిన వారంలోనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ తో జడ్ టీఈ వినియోగదారుల ముందుకు వచ్చింది. జడ్ టీ నుబియా ఎన్1 పేరుతో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనాలో ప్రవేశపెట్టిన జడ్ టీఈ... ఈ ఫోన్  త్వరలోనే అధికారిక ఆన్ లైన్ స్టోర్ లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. దాని ధర దాదాపు రూ.17,200లుగా ఉన్నట్టు అంచనా. గోల్డ్, సిల్వర్ రంగులో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 64 జీబీ రామ్ సపోర్టు చేసే ఈ ఫోన్ 5000పైగా ఫోటోలు, 1000 పైగా మ్యూజిక్ ఫైల్స్ ను, 5 గంటల ఫుల్ హెచ్ డీ వీడియోను స్టోర్ చేసుకోవచ్చని కంపెనీ హామీ ఇచ్చింది. 

నుబియా ఎన్1 ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత నుబియా 4.0 యూఐ
హైబ్రిట్ డ్యూయల్ సిమ్ స్లాట్(నానో ప్లస్ నానో)
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
 401 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ
1.8 జీహెచ్ జడ్ మీడియా టెక్ హెలియో పీ10 ఆక్టా కోర్ ఎస్ఓసీ
3 జీబీ ర్యామ్
64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
128 జీబీ విస్తరణ మెమరీ
13 ఎంపీ వెనుక కెమెరా
13 ఎంపీ ముందు కెమెరా
5000ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4జీ ఎల్ టీఈ
 

మరిన్ని వార్తలు