అలరిస్తూ ఆలోచింపజేసే ‘బ్రహ్మ.కామ్‌’

12 Dec, 2017 20:34 IST|Sakshi

సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్‌ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్‌ విజయ్‌ తెలిపారు. మెలినా కార్తికేయన్‌ నిర్మించిన ఈ చిత్రంలో నకుల్‌ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్‌ విపిన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర, కౌశల్య, ముట్టై రాజేంద్రన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదో ఒకటి కోరుతూనే ఉంటారు.. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్‌ అని తెలిపారు. ఇది పూర్తిస్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. నకుల్‌ ఒక యాడ్‌ ఫిలిం డర్శకుడిగా, ఆస్నాజవేరి మోడల్‌గా, సిద్ధార్థ్‌ విపిన్‌ యాడ్‌ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్‌ విపిన్‌లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు. దర్శకుడు కె.భాగ్యరాజ్‌ దేవుడిగా నటించారన్నారు. దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్‌ ఎప్పుడూ ణేదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఇక నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్‌ పాత్రలో కనువిందు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

  

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా