పొరుగింట్లో కల్యాణి 

12 Dec, 2017 20:18 IST|Sakshi

-టాలీవుడ్‌తో అరంగేట్రం

పొరిగింటి పుల్లకూర రుచి అన్నది నానుడి. ఇది వాస్తవం కూడా. కమలహాసన్‌ వారసురాలు శ్రుతిహాసన్‌ నటిగా పరిచయమైంది బాలీవుడ్‌లోనే. తర్వాత టాలీవుడ్, ఆపై కోలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక మలయాళీ. రాధ కోలీవుడ్, టాలీవుడ్‌లలో కథానాయకిగా రాణించినా తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే తొలుత జోష్‌ అనే టాలీవుడ్‌ చిత్రంలో అవకాశం వచ్చింది.  ఆ తరువాత కోలీవుడ్‌లో నటించిందనుకోండి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు జాన్వీని తొలుత తెలుగులో పరిచయం చేయాలని భావించినా హిందీ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది.

తాజాగా కల్యాణి విషయంలోనూ ఇదే జరిగింది. ఇంతకీ కల్యాణి ఎవరో చెప్పలేదు కదూ. ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. ప్రియదర్శన్, లిజీలు సుమారు 25 ఏళ్లు కలిసి కాపురం చేసి మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే విడిపోయారు. వీరికి ఒక కూతురు, కొడుకు. ఆ కూతురే కల్యాణి. న్యూయార్క్‌లో చదువుకుంటున్న కల్యాణిని హీరోయిన్‌ చేయడానికి లిజీ కోలావుడ్‌లో చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అవేవీ ఫలించలేదు. టాలీవుడ్‌ మాత్రం కల్యాణిని కథానాయకిగా స్వాగతించింది. నాగార్జున రెండో వారసుడు అఖిల్‌ హీరోగా నటించిన హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. 24 చిత్రం ఫేమ్‌ విక్రమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ చిత్రం హిట్‌ అయితే ఆమెను  కోలీవుడ్‌ కచ్చితంగా రెడ్‌కార్పెట్‌తో స్వాగతిస్తుందని చెప్పవచ్చు.

  

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా