అరుణ్‌ విజయ్‌తో మిస్‌ ఫెమినా

13 Dec, 2017 19:15 IST|Sakshi

మిస్‌ ఫెమినా, మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌లకు సినీ రంగంలో మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుస్మితాసేన్, ఐశ్వర్యరాయ్‌ల నుంచి చాలామంది సిల్వర్‌స్క్రీన్‌పై వెలిగారు. తాజాగా మిస్‌ ఫెమినా 2015 కిరీటాన్ని గెలుచుకున్న తాన్య హోప్‌ కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. యువ నటుడు అరుణ్‌ విజయ్‌తో రొమాన్స్‌ చేస్తోంది. కుట్రం 23 వంటి విజయవంతమైన చిత్రం తరువాత అరుణ్‌విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం తడం. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెదన్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. జూన్‌ నెల నుంచే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మిస్‌ ఫెమినా 2015 తాన్యా హోప్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో నటించడం గురించి ఈ సుందరి మాట్లాడుతూ మిస్‌ ఫెమినా కీరీటం గెలుచుకున్న తరువాత పలు భాషా చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయన్నారు. మోడలింగ్‌లో కొనసాగుతున్న తనకు కోలీవుడ్‌లో తడమ్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. బాలీవుడ్‌ తరువాత అందరి దృష్టినీ ఆకర్షించేది కోలీవుడ్‌ చిత్రాలేనని పేర్కొన్నది. ఇక్కడ పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘తడమ్‌’తో తనకు కోలీవుడ్‌లో మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇక్కడ మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ ఇప్పటికే టాలీవుడ్‌లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం ద్వారా పరిచయం అయ్యారన్నది గమనార్హం.

  

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా