అతడు ఆంధ్రావాడై ఉండాలి!

13 Dec, 2017 19:08 IST|Sakshi

హీరోయిన్లు కూడా మామూలు మనుషులే. అందరిలానే వారికీ కోరికలు, కలలు ఉంటాయి. అవి నెరవేరాలని కోరుకుంటారు. అలాంటి ఆశలు తనకూ ఉన్నాయంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. కోలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా పాగా వేయాలన్న కోరిక మొదట్లో నెరవేరకపోయినా టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ టాప్‌ హీరోలతో జత కట్టి సక్సెస్‌ఫుల్‌ నాయకిగా పేరు తెచ్చున్నది. తాజాగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంతో కోలీవుడ్‌లో విజయ దాహాన్ని కొంచెం తీర్చుకుంది. ఇంకా ఇక్కడ పలు చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్న ఈ అమ్మడు తాజాగా విజయ్‌ 62వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యతోనూ నటించే అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.

ఈ బ్యూటీ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన మనసులోని భావాలను విలేకరులకు వ్యక్తపరిచింది. సాధారణంగా హీరోయిన్‌ కనపబడితే ముందో, చివర్లోనో విలేకరులు అడిగే కామన్‌ ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎలాంటి భర్త ఉండాలని కోరుకుంటున్నారు? ఎవరినైనా ప్రేమించారా? వంటివే. అందుకు ఎవరికి తోచినవి వారు చెబుతుంటారు. అదే ప్రశ్నను రకుల్‌ప్రీత్‌సింగ్‌ను అడిగతే తనేమన్నదో చూద్దాం. పెళ్లి జీవితంలో ముఖ్యమైన అంశం. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నేనూ పెళ్లికి సిద్ధం అవుతాను. అయితే ఒక్క కండిషన్‌.. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారని అడుగుతున్నారు. అతడెవరనే విషయాన్ని పక్కనపెడితే ముఖ్యంగా తను ఆంధ్రావాడై ఉండాలి అని బదులిచ్చింది. దీంతో ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగువాడిని కోరుకుంటున్నదంటే టాలీవుడ్‌కు చెందిన ఎవరితోనే లవ్‌లో పడి ఉంటుందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. 

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా