పాస్‌పోర్టు ఇప్పుడు మరింత సులువు

10 Feb, 2018 08:50 IST|Sakshi

బర్త్‌ సర్టిఫికెట్‌ అక్కరలేదు

వయస్సు నిర్ధారించే సర్టిఫికెట్‌ ఉంటే చాలు

తిరుపతి క్రైం: విదేశాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పాస్‌పోర్ట్‌ చాలా అవసరం. దీన్ని తీసుకోవాలంటే ఒకప్పుడు చుక్కలు కనబడేవి. రానురాను కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలిస్తూ ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం వారం రోజుల్లో పాస్‌పోర్టు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అనే నిబంధన ఉండేది. ప్రస్తుతం తప్పనిసరి కాదు. జనన ధ్రువీకరణ గుర్తించే పీసీ, మార్కులిస్టు, పాన్, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రికార్డు, రిటైర్డ్‌ అయిన ఉద్యోగులు పెన్షన్‌ ఆర్డర్‌పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలు ఇచ్చే పాలసీబాండ్లను పరిగణనలోకి తీసుకుంటారు.

చిన్నపిల్లల వయస్సును ధ్రువీకరిస్తూ బర్త్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలి. పెళ్లయిన వారు ధ్రువీకరణ, నోటరికి సంబంధించిన నిబంధనలు కూడా ప్రభుత్వం తొలగించింది. విడాకులు తీసుకున్న భాగస్వామి పేరు, విడాకుల డిక్రీ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి పేరును నమో దు చేసుకునేందుకు వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. గతంలో 15 రకాల అనుబంధ పత్రాలను జత చేయాల్సి ఉండేది. ఇందులో ఏ, సీ, డీ, ఈ, జే, కే సెక్టారులను తొలగించారు. వీటికి బదులుగా తెల్లకాగితంపై స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది. నోటరీ పద్ధతిని తప్పించారు. ఇలా అనేక నిబం ధనలను తొలగించడంతో పాస్‌పోర్ట్‌ ప్రతి ఒక్కరికీ మరింత చేరువ కానుంది.

మరిన్ని వార్తలు