చంద్రగహణం.. నేడు ప్రత్యేక దర్శనాలు రద్దు

31 Jan, 2018 09:04 IST|Sakshi

సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో బుధవారం అన్నప్రసాదాల వితరణను టీటీడీ నిలిపివేసింది. అలాగే విఐపి బ్రేక్‌ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసిం‍ది. గ్రహణం కారణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5.18 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతున్నందున రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అలాగే శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నందున టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి లావణ్యత్రిపాఠి, క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు చాముండేశ్వరీ నాధ్లు దర్శించుకున్నారు.

>
మరిన్ని వార్తలు