మీ సిలిండర్ పై డేట్ చూసుకున్నారా..

30 Jan, 2018 08:33 IST|Sakshi

గ్యాస్‌ సిలిండర్ల గడువు తేదీపై అవగాహన అవసరం

సత్యవేడు: మనం వినియోగించే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది,  అలాగే నిత్యం వంట గదిలో మనం ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌కూ  గడువు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కాలం చెల్లిన సిలిండర్‌ను వినియోగించడం ప్రమాదకరం. అందుకే  ఆలాంటి కాలపరిమితి తేదీని గుర్తించడం ఎలాగో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముందుగా  సిలిండర్‌ గడువు తేదీని గుర్తించాలి. సిలిండర్‌పై ఉన్న రింగ్‌కు కింద భాగంలో మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వెనుక సిలిండర్‌ గడవు తేదీ ముద్రించి ఉంటుంది. రింగ్‌కు  కింద భాగంలోలో బద్దె పై ముద్రించి ఉన్న తేదీల్లో ఏడాదిలోని 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి ప్రతి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున రాసి ఉంటుంది.

నిల్వవుంచే సిలిండర్లు ప్రమాదం..
కొందరు సిలిండర్లు కొన్న తర్వాత నెలలు తరబడి వాడకుండా నిల్వ ఉంచుతారు. మరి కొందరు బ్లాక్‌లో కొని మరీ వాడుతుంటారు. అయితే సిలిండర్లపై గుర్తించిన గడువు తేదీలోగా వాడితేనే ఉత్తమం, కాలం చెల్లిన సిలిండర్లను వాడకం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి సిలిండర్లను సంబంధిత డీలర్‌కు వాపస్‌ చేయాలి. ముఖ్యంగా సిలిండర్‌ తీసుకున్న తేదీ నుంచి వాడుకునే తేదీ నాటికి గడువు నెలను గమనించి వాడుకోవాలి.

Read latest Chittoor News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: శ్రీవారి ప్రసాదాల తయారీ కుదింపు 

యూట్యూబ్‌లో చూసి ప్రాణాల మీదకు..

కరోనా రాకుండా.. స్టీమ్‌ బూత్‌

చిత్తూరును రెడ్‌ జిల్లాగా ప్రకటించిన కేంద్రం

వాళ్లు స్వయంగా ఆస్పత్రికి వెళ్లాలి : పెద్దిరెడ్డి

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం