ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..?

15 Jan, 2018 09:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంతకుముందు నగదు లావేదేవీలకు బ్యాంకు అకౌంట్‌ ఉంటే సరిపోయేది. పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్‌ లావాదేవీలు ఊపందుకున్నాయి. నేటికీ ఏటీఎంల వద్ద నగదు లేకపోవడంతో నగదు లావాదేవీల విషయంలో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారులందరినీ నగదు లావాదేవీలవైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే మార్కెట్‌లో నగదు కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొంచెం కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నా వారంతా ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ వైపు మళ్లుతున్నారు.

ప్రస్తుతం ఉద్యోగులు చాలామంది 2, 3 బ్యాంక్‌ ఖతాలకు సంబంధించి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగిస్తున్నారు. దీంతో పాస్‌వర్డ్‌లు మర్చిపోవడం పరిపాటైపోయింది. ఎవరైనా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను తప్పుగా నమోదు చేస్తే కొన్ని గంటల పాటు ఆ నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాను లాక్‌ చేస్తారు. సాధారణంగా 24 గంటల పాటు పనిచెయ్యదు. దేశంలోనే బ్యాంకింగ్‌ రంగంలో అతి పెద్ద బ్యాంక్‌ వ్యవస్థ ఎస్‌బీఐ. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ సంబంధించి పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేసుకోవడం, ఎస్‌బీఐ లాగిన్‌ పాస్‌వర్డ్‌ మర్చుకోవడం తెలుసుకుందాం..

మూడు విధాలుగా రీసెట్‌ చేసుకోవచ్చు
ఏటీఎమ్‌ కార్డును, ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్‌ కార్డు వివరాలు లేకుండా రీసెట్‌ చేసుకోవచ్చు


అనుసరించాల్సిన పద్ధతులు ఇలా..
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ www.onlinesbi.com లోకి లాగిన్‌ అవ్వాలి. ‘ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌’పై క్లిక్‌ చెయ్యాలి. ‘మీ యూజర్‌ నేమ్, బ్యాంక్‌ ఖాతా సంఖ్య దేశం, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ సంఖ్య, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చెయ్యాలి. ‘సబ్‌మిట్‌పైన క్లిక్‌ చెయ్యాలి. ‘మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ కాలంలో వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చెయ్యండి. ‘కన్‌ఫర్మ్‌’ బటన్‌ క్లిక్‌ చేయండి. సరైన ఓటీపీని ఎంటర్‌ చేస్తే పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి.
ఒకటి : ఏటీఎమ్‌ కార్డును ఉపయోగించి
రెండు : ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి
మూడు : ఏటీఎమ్‌ కార్డు వివరాల్లేకుండా

ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఎస్‌బీఐ లాగిన్‌ పాస్‌వర్డ్‌ మార్చుకోండిలా..
మొదట ఎస్‌బీఐ నెట్‌
బ్యాంకింగ్‌లో లాగిన్‌ అవ్వండి
ప్రొఫైల్‌ ట్యాబ్‌కు వెళ్లండి. ఆ తర్వాత చేంజ్‌ పాస్‌వర్డ్‌పైన క్లిక్‌ చెయ్యండి. ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి. ప్రొఫైల్‌ పాస్‌వర్డ్, లాగిన్‌ పాస్‌వర్డ్‌ ఒకలాగే ఉండకూడదని గుర్తుంచుకోండి. పాత పస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి. కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి రెండోసారి అదే పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయాలి. సబ్‌మిట్‌ పైన క్లిక్‌ చేయండి. నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది.   

మరిన్ని వార్తలు