తనిఖీల్లో రూ.7 కోట్లు దాటిన నగదు

25 Mar, 2019 01:49 IST|Sakshi

ఒక్కరోజులోనే 114 ఆయుధాల సరెండర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల తనిఖీలు సాగుతున్నాయి. ఆదివారం నాటికి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.7 కోట్లు (రూ. 7.20 కోట్లు) దాటడ మే నిదర్శనం. శనివారం నాటికి పట్టు కున్న మొత్తం రూ.5.3 కోట్లు కాగా, 24 గంటల్లోనే రూ.1.88 కోట్లు పట్టుకోవడం గమనార్హం. శనివారం 8,153గా ఉన్న లైసెన్స్‌డ్‌ ఆయుధాలు ఆదివారాని కి 8,267కి చేరాయి. ఆదివారం ఒక్కరోజే 114 ఆయుధాలు డిపాజిట్‌ చేయడం విశేషం. మొత్తం 18,128 బైండోవర్‌ కేసులు నమోదయ్యాయి. 

రూ.1.49 కోట్ల నగదు స్వాధీనం 
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో ఎఫ్‌ఎస్‌టీ టీమ్‌ ఏఎస్‌ఐ సామ్యూల్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా..అడిక్‌మెట్‌ నివాసి, అకౌంటెంట్‌ గోపినాథ్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాఘవేందర్‌ అనే వ్యక్తులు శనివారం రాత్రి యాక్టివాపై పెద్దమ్మ గుడి సమీపం నుంచి వెళ్తున్నారు. తనిఖీల్లో భాగంగా వారిని చెక్‌ చేయగా బ్యాగ్‌లో రూ. 4.49 కోట్ల నగదు లభించింది. డబ్బుకు సంబంధించి వారు లెక్కలు చెప్పలేదు. వా రు రమేశ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారి నుంచి డబ్బు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాగా, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు