అమ్మా.. సారీ!

27 Sep, 2019 01:36 IST|Sakshi

12 ఏళ్ల చిన్నారి కన్నీటి వ్యథ

రెండేళ్లుగా 30 మంది అత్యాచారం

కేరళలో వెలుగుచూసిన దారుణం

మళప్పురం: 12 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా దాదాపు 30 మంది అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కేరళలోని కొజిక్కోడ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన ఒక కౌన్సెలింగ్‌ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచి్చంది. దీనిపై ఆ బాలిక తండ్రి, మరో ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఆ బాలికను దగ్గర్లోని షెల్టర్‌ హోంలో చేరి్పంచారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక..సూ్కల్‌లో ముభావంగా ఉండటంతో కౌన్సెలర్‌ ఆ బాలిక ఇంటి పరిస్థితులపై ప్రశి్నంచారు. దాంతో కన్నీటిపర్యంతమైన బాలిక ఆ దారుణాన్ని వెల్లడించింది. రెండేళ్ల క్రితం (అప్పుడు ఆ బాలికకు పదేళ్లు) తన తండ్రి ఓ స్నేహితుడి వద్ద కొంత డబ్బు అప్పు తీసుకున్నాడని, అది తీర్చలేని పరిస్థితుల్లో ఆ స్నేహితుడికి తనను అప్పగించాడని తెలిపింది.

ఆ తరువాత ఆ స్నేహితుడు మరి కొందరిని తీసుకువచ్చాడని, అలా రెండేళ్లుగా ఈ దారుణం కొనసాగుతోందని వెల్లడించింది. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, నానమ్మ అనారోగ్యం.. తదితర ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన తండ్రిని అరెస్ట్‌ చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆ బాలిక వేడుకోవడం, ‘అమ్మా సారీ’అంటూ వారున్న ఇంటి తలుపుపై ఆ చిన్నారి రాయడం అక్కడివారికి కన్నీళ్లు తెప్పించింది. ఆ పాపకు పాఠశాలలో స్నేహితులెవరూ లేరని, ఎవరితో అంత కలుపుగోలుగా ఉండకపోయేదని, ఎప్పుడు ముభావంగా, నీరసంగా ఉండేదని క్లాస్‌మేట్స్‌ తెలిపారు.


అయినా, ఆ బాలికను ఆమె తల్లే పాఠశాలకు తీసుకువచి్చ, తీసుకువెళ్లేదని, ఎవరితో మాట్లాడనిచ్చేది కాదని వివరించారు. దాదాపు ప్రతీరోజు రాత్రంతా ఆ బాలిక అరుపులు, ఏడుపులు వినిపించేవని, అయితే, అది వారి ఇంటి విషయమని, అందులో కలగజేసుకోకూడదనే ఉద్దేశంతో తాము పట్టించుకోలేదని ఆ బాలిక ఇంటి దగ్గర్లోని వారు చెప్పారు. మొదట్లో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండే పాప.. నిస్తేజంగా, స్తబ్దుగా మారిపోవడంతో వారి ఇంటి దగ్గర్లోని వారే పాఠశాలలో సమాచారమివ్వడంతో ఆ బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమాచారం. ఆ బాలిక తల్లి మాత్రం ఇదంతా అబద్ధమని, కుట్ర అని చెబుతోంది.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మధ్యప్రదేశ్‌లో ‘హనీ ట్రాప్‌’

నకిలీ ఫొటోతో మోసం

'ఈ–సిగరెట్స్‌ ఉంటే ఇచ్చేయండి'

స్కూల్‌ ఫీజు అడిగిందని కూతుర్ని..

12 ఏళ్ల పాపపై రెండేళ్లుగా 30 మంది....

ఈఎస్‌ఐ స్కాం.. దూకుడు పెంచిన ఏసీబీ

వలేసి పట్టుకుని.. తాళ్లతో చేతులు కట్టేసి

వరంగల్‌లో భారీ పేలుడు

నడిరోడ్డు మీద గాల్లోకి కాల్పులు జరుపుతూ..

ఎన్‌కౌంటర్‌లో 'దాదా' హతం

ధార్వాడ దడదడ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

నాలుగునెలల బాలుడి మృతి

కోర్టులో పోలీసులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు

అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి..

వరాల మాట సరే.. చోరీల సంగతేంటి స్వామీ

భార్యను రేప్‌ చేసిన ప్రొఫెసర్‌!

సెక్స్‌ రాకెట్‌: వీడియోలు తీసి.. బ్లాక్‌మెయిల్‌ చేసి

పీఎన్‌బీ స్కాం : ఆంటిగ్వా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం తిరిగి తిరిగి.. చివరకు..

ఈ–సిగరెట్స్‌పై నిఘా

అనేక మందిని ఇష్టం వచ్చినట్లు ‘వాడేశాడు’

చేతబడి చేశారని.. సజీవ దహనం

సొంతపిన్నిని చంపినందుకు జీవిత ఖైదు

కొడుకులు పట్టించుకోవడం లేదని..

ఖైదీకి.. వైద్యం పేరుతో రాజభోగం

సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య

గుట్టుగా దాటిస్తూ.. కోట్లు కొల్లగొడుతూ..     

ఉగ్ర భీతి.. పేలుడు పదార్థాలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

వైజాగ్‌ టు హైదరాబాద్‌

హ్యాపీ.. హ్యాపీ

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

తీవ్రవాదం నేపథ్యంలో...