రూ.14 లక్షల బంగారం పట్టివేత

12 Feb, 2019 11:37 IST|Sakshi
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారు

చెన్నై, అన్నానగర్‌: చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో ఆదివారం స్కేటింగ్‌ షూలో దాచిఉంచి అక్రమంగా తెచ్చిన రూ. 8 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనమ్‌బాక్కం విమానాశ్రయానికి ఆదివారం మలేషియా నుంచి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన ఓ యువకుడిని అనుమానంతో నిలిపి అతని లగేజీను తనిఖీ చేశారు. అందులో స్కేటింగ్‌ షూ ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.8 లక్షల విలువైన 225 గ్రాముల బంగారం కనిపించింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని యువకుడి వద్ద విచారణ జరుపుతున్నారు.

తిరుచ్చి విమానాశ్రయంలో..
తిరుచ్చి విమానాశ్రయానికి ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి ఎయిర్‌ ఏషియా విమానం వచ్చింది. అందులో వచ్చిన ఓ ప్రయాణికుడు మెడలో ధరించిన బంగారు చైన్‌ను అక్రమంగా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తిం చారు. అతడు మదురైకి చెందిన ఆసిక్‌అహ్మదు అని తెలిసింది. రూ.6.31 లక్షల విలువైన బంగారు చైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని, ఆసిక్‌ అహ్మదు వద్ద విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు