బాలుడి ఊపిరితిత్తుల్లో స్ప్రింగ్‌

27 Apr, 2018 10:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబాయి: మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఏడేళ్ల బాలుడు టాయ్‌ గన్‌లోని స్ప్రింగ్‌ మింగేయడంతో పరిస్థితి విషమంగా మారింది. బాలుడు ఇంటి వద్ద టాయ్‌ గన్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. అనుకోకుండా టాయ్‌గన్‌లోని స్ర్పింగ్‌ బాలుడి స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఇరుక్కుపోయింది. ఈ విషయం ఎవరూ గమనించలేదు.  ఆ తర్వాత బాలుడు నిరంతరాయంగా దగ్గుతుండటంతో తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

బాలుడిని పరిశీలించిన థానేలోని ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఊపిరితిత్తుల్లో 1.5 సెంటీమీటర్ల పొడవున్న స్ప్రింగ్‌ ఉన్నట్లు గుర్తించారు.  బాలుడు కావడంతో ఆపరేషన్‌ చేసి స్ప్రింగ్‌ను తీయడానికి డాక్టర్లు వెనకాడారు.  బయోస్కోపీ ద్వారా స్ప్రింగ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు