నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్యాయత్నం

7 Dec, 2019 11:30 IST|Sakshi

చండీగఢ్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చండీగఢ్‌లోని సెక్టర్‌ -7లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచుకుల సెక్టర్‌ 11లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదోతరగతి చదివే బాలిక(15) తల్లిదండ్రులతో కలిసి చండీగఢ్‌లో నివాసం ఉంటుంది. కాగా, గత బుధవారం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు..  రోజుమాదిరి తమ కూతురు  ట్యూషన్‌కు వెళ్లిందిన భావించి వెతికే ప్రయత్నం చేయలేదు. రాత్రి అయినప్పటికీ కూతరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలికకు ఫోన్‌ చేశారు. బాలిక స్పందించకోవడంతో పాఠశాలకు ఫోన్‌ చేసి అడిగారు. అయితే ఆ రోజు బాలిక పాఠశాలకు రాలేదని సిబ్బంది తెలిపింది. దీంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. అదే రోజు రాత్రి 8 గంటలకు బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, తన కుతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడలేదని, ఎవరో నిప్పంటించి హత్య చేసేందుకు కుట్రపన్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. 

ఈ ఘటనలో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానం: 
ఈ ఘటన డీసీపీ కమల్‌ గోయల్‌ మాట్లాడుతూ.. విచారణలో భాగంగా పోలీసులు బాలిక బ్యాగ్‌ను  తనిఖీ చేయగా  ఒక మొబైల్‌ ఫోన్‌, బస్సు టికెట్లు లభించాయన్నారు. బాలిక ఆత్మహత్యయత్నానికి పాల్పడిందా లేదా ఎవరైనా పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారా అన్న కోణంలో విచారణ చేపట్టామని తెలిపారు.  బాలిక మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా.. ముంబైలోని ఓ వ్యక్తితో అమెకు పరిచయం ఉన్నట్లు తెలిసిందన్నారు. తన వాట్సప్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరవడానికి ఫోన్‌ను సైబర్‌ సెల్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపింపించినట్లు డీసీపీ పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు