150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

9 Oct, 2019 08:57 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు వెంకటేశ్‌

కర్ణాటకకు తరలించేందుకు గౌతపూర్‌ శివారులో నిల్వ 

బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు

సాక్షి, తాండూరు: వందల క్వింటాళ్లు రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం విజిలెన్స్, సివిల్‌సప్లయ్, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌలి, సివిల్‌ సప్లయి తహసీల్దార్లు నందిని, పద్మ, రూరల్‌ సీఐ జలేంధర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశం గత కొంతకాలంగా రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గౌతంపూర్‌ శివారులో ఉన్న రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వెనకాల ఓ గదిలో 150 క్వింటాళ్ల (15టన్నుల) రేషన్‌ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఆ ఇంటిపై ఆదివారం దాడులు చేశారు. కాగా ఆ గదిలో 450 బస్తాల రేషన్‌ బియ్యం ఉన్నాయి. ఇందులో 300 బస్తాల దొడ్డు బియ్యం, 150 బస్తాల నూకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని తాండూరులోని స్టాక్‌పాయింట్‌కు తరలించారు. సంబంధిత వ్యాపారులు రేషన్‌ బియ్యం సేకరించి కొడంగల్, జహీరాబాద్‌ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంత్సరాలుగా ఇలా సేకరిస్తున్న రేషన్‌బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచి.. వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాండూరులో ఈ అక్రమ దందా కొనాసాగుతున్న ఈ దాడులు నిర్వహించినవారిలో కరన్‌కోట్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ ఉన్నారు.  

కేసు నమోదు చేశాం 
గౌతపూర్‌లోని రిలయన్స్‌ పెట్రోల్‌బంక్‌ వెనకాల ఓ గదిలో 15 టన్నులు అక్రమంగా రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించాం. రేషన్‌బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తి (వెంకటేశ్‌)పై క్రిమినల్‌ కేసుతో పాటు 6ఏ కేసు నమోదు చేశాం. కేసు నమోదు తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ ఉంటుంది. 
– నందిని, తహసీల్దార్, సివిల్‌సప్లయ్, వికారాబాద్‌ 

>
మరిన్ని వార్తలు