15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

27 Oct, 2019 15:33 IST|Sakshi

ముంబై : ముంబైలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుందిఎక్కువసేపు మేల్కొవద్దని తండ్రి మందలించినందుకు 17 ఏళ్ల ఇంజనీరింగ్‌ యువతి 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.  సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు  ధ్రువీకరించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బీటెక్‌ మొదటి సంవత్పరం చదువుతున్న యువతి తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలోని భండప్ శివారులో ఉన్న డ్రీమ్‌ బిల్డింగ్స్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తండ్రి వచ్చేసరికి కూతురు ఇంకా మెలుకువతో ఉన్న సంగతి గమనించాడు. ఆరోగ్యం పాడైతుంది త్వరగా పడుకో అని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి బిల్డింగ్‌లోని 15వ అంతస్తుకు చేరుకొని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. కాగా, యువతి ఆత్యహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు